
బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ విజయంపై కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామానికి 6 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (195 బంతుల్లో 155 బ్యాటింగ్; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, డౌరిచ్ (191 బంతుల్లో 97 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి విండీస్ ఏకంగా 561 పరుగులు ముందంజలో నిలిచింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు అందనంత లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగుల వద్దే విండీస్ ఆరో వికెట్ కోల్పోయినా హోల్డర్, డౌరిచ్ అద్భుతంగా ఆడి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.