మెరుగైన స్థితిలో దక్షిణాఫ్రికా | Hashim Amla century frustrates tourists | Sakshi
Sakshi News home page

మెరుగైన స్థితిలో దక్షిణాఫ్రికా

Jan 5 2016 12:44 AM | Updated on Sep 3 2017 3:05 PM

మెరుగైన స్థితిలో దక్షిణాఫ్రికా

మెరుగైన స్థితిలో దక్షిణాఫ్రికా

హాషిం ఆమ్లా, డివిలియర్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ కారణంగా....

♦  తొలి ఇన్నింగ్స్‌లో 353/3
♦  ఆమ్లా అజేయ శతకం
♦  ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
 కేప్‌టౌన్:
హాషిం ఆమ్లా, డివిలియర్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ కారణంగా.... ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (371 బంతుల్లో 157 బ్యాటింగ్: 21 ఫోర్లు) టెస్టు కెరీర్‌లో 24వ సెంచరీ పూర్తి చేసుకోగా... డివిలియర్స్ (211 బంతుల్లో 88; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకం కోల్పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 183 పరుగులు జోడించడం విశేషం.
   ప్రస్తుతం ఆమ్లాతో పాటు డు ప్లెసిస్ (115 బంతుల్లో 51; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.

ఈ జోడి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 85 పరుగులు జత చేసింది. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా మరో 276 పరుగులు వెనుకబడి ఉంది. 141/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆమ్లా, డివిలియర్స్ జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యాలు కలిసి రావడంతో వీరిద్దరు మూడు సార్లు అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్నారు.
50 పరుగుల వద్ద డివిలియర్స్ టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. జాక్ కలిస్, గ్రేమ్ స్మిత్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్. మరో వైపు 93 పరుగుల వద్ద ఆమ్లా కూడా 7 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం మూడో రోజు ఆటలో విశేషం.  
 
 నాలుగో రోజు ఆట మధ్యాహ్నం గం. 2.00 నుంచి  టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement