మహిళా టి20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ | Harmanpreet to captain India in T20Is, Mithali retained as ODI skipper | Sakshi
Sakshi News home page

మహిళా టి20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్

Oct 30 2016 11:28 AM | Updated on Sep 4 2017 6:46 PM

భారత మహిళల టి20 కెప్టెన్‌గా మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నియమించారు.

న్యూఢిల్లీ: భారత మహిళల టి20 కెప్టెన్‌గా మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నియమించారు. విండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్, ఆసియాకప్ టి20 టోర్నీల కోసం మహిళా జట్లను ప్రకటించారు. వెస్టిండీస్‌తో వచ్చే నెల 18 నుంచి జరిగే టి20 సిరీస్‌తో పాటు నవంబర్ 27 నుంచి థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యే ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌కు హర్మన్‌ప్రీత్ సారథిగా వ్యవహరిస్తుంది.

 

అయితే వచ్చే నెల 10 నుంచి 16 వరకు వెస్టిండీస్‌తోనే జరిగే మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగుతుంది. మ్యాచ్‌లన్నీ విజయవాడ సమీపంలోని మూలపాడులో జరుగుతాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement