హరికృష్ణ గేమ్ ‘డ్రా’ | Hari Krishnagame 'draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గేమ్ ‘డ్రా’

Jun 2 2016 12:56 AM | Updated on Aug 29 2018 1:16 PM

షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు.

న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. హు ఇఫాన్ (చైనా)తో బుధవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

ప్రత్యూష గెలుపు: తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో  బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. అనస్తాసియా (ఇండోనేసియా)తో బుధవారం జరిగిన ఏడో రౌండ్‌లో ప్రత్యూష 46 ఎత్తుల్లో గెలిచింది. ప్రత్యూష మూడు పాయింట్లతో 20వ ర్యాంక్‌లో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement