ద్వేషించినా సరే లెక్కచేయను : గుత్తా జ్వాల | Gutta Jwala Fire on Trollers with a Selfie | Sakshi
Sakshi News home page

ద్వేషించినా సరే లెక్కచేయను : గుత్తా జ్వాల

Sep 22 2017 9:41 AM | Updated on Sep 22 2017 4:37 PM

Gutta Jwala Fire on Trollers with a Selfie

ఇటీవలికాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలికాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో సినీ తారలు, క్రీడాకారిణిలు శ్రుతి మించుతున్నారంటూ నెటిజన్లలో ఓ వర్గం విరుచుకుపడుతోంది.

అయితే తన ఒక్క ట్వీట్తో వీటన్నింటిని లెక్క చేయబోనని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పష్టం చేశారు. ద్వేషించేవాళ్లు ద్వేషించినా కానీ, ముందు నన్నో సెల్ఫీ దిగనివ్వండి అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  మిమ్మల్ని మీరు ప్రేమించండి. ట్రోలర్స్(సోషల్ మీడియాలో కామెంట్లలో విరుచుకుపడేవారు) గురించి పట్టించుకోకండి.  పాజిటివిటీ, ప్రేమని పంచండి అంటూ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement