పెళ్లికొడుకు కాబోతున్న క్రికెటర్‌ | Glenn Maxwell Announces Engagement to Vini Raman | Sakshi
Sakshi News home page

విని రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

Feb 26 2020 7:19 PM | Updated on Feb 26 2020 7:30 PM

Glenn Maxwell Announces Engagement to Vini Raman - Sakshi

భారత సంతతి యువతి విని రామన్‌ను అతడు పెళ్లాడనున్నాడు.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. భారత సంతతి యువతి విని రామన్‌ను అతడు పెళ్లాడనున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన విని రామన్‌తో చాలా కాలంగా అతడు ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. విని రామన్‌ చేతికి తొడిగిన ఉంగరంతో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్‌ క్రిస్‌ లిన్‌ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: మ్యాక్స్‌వెల్‌ మళ్లీ వచ్చాడు)

మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం బయట ప్ర్రపంచానికి తెలిసింది. గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. మ్యాక్సీ-విని తరచుగా ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానసిక సమస్యలు కారణంగా కొంతకాల క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అయితే తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు మొదట గుర్తించింది విని రామనే అని మ్యాక్స్‌వెల్‌ అప్పట్లో వెల్లడించాడు. భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా అతడు నిలవనున్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ షాన్‌ టైట్‌.. మషూమ్‌ సింఘా అనే యువతిని ప్రేమించిన పెళ్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement