ఐసీసీ నాయకత్వ స్కిల్స్‌.. గంగూలీలో భేష్‌ | Ganguly Has The Right Political Skills To Lead ICC, David Gower | Sakshi
Sakshi News home page

ఐసీసీ నాయకత్వ స్కిల్స్‌.. గంగూలీలో భేష్‌

May 15 2020 4:36 PM | Updated on May 15 2020 4:38 PM

Ganguly Has The Right Political Skills To Lead ICC, David Gower - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా సక్సెస్‌ బాటలో పయనిస్తున్న సౌరవ్‌ గంగూలీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ని నడిపించే స్కిల్స్‌ విశేషంగా ఉన్నాయని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ క్రికెట్‌లో బీసీసీఐని నడపడం అత్యంత కష్టమని, దానిని సమర్ధవంతంగా నడిపిస్తున్న గంగూలీ.. ఐసీసీకి నాయకత్వం వహించడానికి కూడా సరిపోతాడని గోవర్‌ స్పష్టం చేశాడు. ఏ వ్యవస్థనైనా నడిపించాలంటూ రాజకీయపరమైన స్కిల్స్‌ అవసరమని అవి గంగూలీలో పుష్కలంగా ఉన్నాయన్నాడు. ఏదొక రోజు ఐసీసీ నాయకత్వ బాధ్యతలను గంగూలీ చేపడతాడనే ధీమా వ్యక్తం చేశాడు. ‘ బీసీసీఐని సక్రమంగా నడిపే వ్యక్తికి చాలా విషయాలపై అవగాహన ఉండాలి. నేను ఏళ్లుగా తెలుసుకున్నదేమిటంటే బీసీసీఐలో ఒక సక్సెస్‌ఫుల్‌ ప్రెసిడెంట్‌ అయితే అతను ఐసీసీకి సరిపోతాడు. (శశాంక్‌ పదవీ కాలం పొడిగింపు..!)

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఆరంభం అదిరింది. ఆ తరహా రాజకీయ లక్షణాలే ఐసీసీలో కూడా అవసరం. గంగూలీలో రాజకీయ లక్షణాలతో పాటు మంచితనం కూడా ఉంది. భారత్‌లో క్రికెట్‌కున్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక దేశంలో ఒక క్రీడకు ఇంతటి అభిమానం ఉండటం ఒక మంచి పరిణామమే. బీసీసీఐ అధ్యక్షుడిగా చార్జ్‌ తీసుకోవడం అంటే అంత తేలిక కాదు. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్‌ పదవే అత్యంత కష్టమైనంది. గంగూలీ ఒకరు చెప్పేది వింటాడు.. అతని అభిప్రాయం కూడా నేరుగా చెబుతాడు.  ఏ పరిపాలన వ్యవస్థలో ఉండాలన్నా పొలిటికల్‌ స్కిల్స్‌ అనేవి ముఖ్యం. అవి గంగూలీలో కావాల్సినంత ఉన్నాయి. ఇప్పటికే బీసీసీఐలో అనేక  మార్పులు తీసుకొచ్చాడు గంగూలీ. ఇంకా భవిష్యత్తులో బీసీసీఐ చీఫ్‌గా ఎన్ని మంచి పనులు చేస్తాడో ఎవరికి తెలుసు’ అని గోవర్‌పేర్కొన్నాడు.  ఇక ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గురించి గోవర్‌ మాట్లాడుతూ.. సరైన సమయంలో దీన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నాడు. టెస్టు ఫార్మాట్‌ ఏమౌతుందో అనే ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో దీనికి కొత్త రూపు తీసుకురావడం నిజంగా అభినందనీయమన్నాడు. 1970, 80వ దశకాల్లో ఈ టెస్టు చాంపియన్‌షిప్‌ అవసరం లేదని, క్రికెట్‌లో వచ్చిన మార్పులు దృష్ట్యా ఇది ప్రస్తుతం అవసరమని గోవర్‌ పేర్కొన్నాడు. (భారీ నష్టం తప్పదు : సౌరవ్‌ గంగూలీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement