క్వార్టర్‌ ఫైనల్స్‌కు ఫెదరర్‌ | French Open Roger Federer Reached Quarter Final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్స్‌కు ఫెదరర్‌

Jun 2 2019 9:55 PM | Updated on Jun 2 2019 10:36 PM

French Open Roger Federer Reached Quarter Final - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్లో స్విస్‌ దిగ్గజం, మూడో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో ఆదివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ 6–2, 6–3, 6–3తో వరుస సెట్లలో లెనార్డో మేయర్‌(అర్జెంటీనా)ను చిత్తు చేశాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడెక్స్‌ 4 ఏస్‌లు సంధించి 30 విన్నర్లు కొట్టాడు. మరోవైపు 4 డబుల్‌ఫాల్ట్స్‌తోపాటు 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో వరల్డ్‌ నెం.12 సెవత్సోవా(లాత్వియా) అనూహ్య పరాజయం పాలైంది. ఆమె 2–6, 0–6తో ప్రపంచ 38వ ర్యాంకర్‌ వాండ్రొసోవా(చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో కంగుతింది. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో పెట్రా మాట్రిచ్‌(క్రొయేషియా) 5–7, 6–2, 6–4తో కనెపి(ఎస్తోనియా)పై చెమటోడ్చి నెగ్గగా, జొహన్నా కొంటా(బ్రిటన్‌) 6–2, 6–4తో వెకిచ్‌(క్రొయేషియా)ను చిత్తు చేసింది. 

బొపన్న జోడీ ఓటమి
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్‌ బొపన్న జోడీ ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో బొపన్న(భారత్‌)–మారియస్‌ కొపిల్‌(రొమేనియా) ద్వయం 6–1, 5–7, 6–7(8/10)తో సెర్బియా జోడీ లజోవిచ్‌–తిపాసరవిచ్‌ చేతిలో ఓడింది. తొలి సెటన్‌ను సునాయాసంగా గెల్చుకున్న బొపన్న జోడీ రెండో సెట్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో టైబ్రేక్‌లో చేతులెత్తేసి ఇంటిబాట పట్టింది.
 

Advertisement
 
Advertisement
Advertisement