ఫ్రాంచైజీల వ్యయ పరిమితి పెంపు | Franchisees of the cost of an increase in the limit | Sakshi
Sakshi News home page

ఫ్రాంచైజీల వ్యయ పరిమితి పెంపు

Oct 21 2013 1:35 AM | Updated on Sep 1 2017 11:49 PM

హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) పాలక మండలి... ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే గరిష్ట పరిమితిని పెంచింది. వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 46 లక్షలు (75 వేల డాలర్లు) ఖర్చుచేసుకునే సౌలభ్యం కల్పించింది.

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) పాలక మండలి... ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే గరిష్ట పరిమితిని పెంచింది. వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 46 లక్షలు (75 వేల డాలర్లు) ఖర్చుచేసుకునే సౌలభ్యం కల్పించింది.
 
  ఇంతకుముందు ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 3.96 కోట్లు (6.5 లక్షల డాలర్లు) కాగా... తాజా పెంపుతో ఈ పరిమితి రూ. 4.42 కోట్ల (7.25 లక్షల డాలర్లు)కు పెరిగింది. రెండో సీజన్ కోసం కొత్తగా ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వచ్చే నెల 18న వేలాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే జనవరి 23 నుంచి ఫిబ్రవరి 23 వరకు హెచ్‌ఐఎల్-2 జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement