
చెన్నై జట్టులో నలుగురు ఫిక్సర్లు!
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.
లలిత్ మోడి ఆరోపణ
లండన్ : ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చెన్నై జట్టులోని నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సర్లని ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు దగ్గర ఉన్న జాబితాలో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్ల జాబితా ఉంది. అది బయటపెడితే కనీసం నలుగురు చెన్నై ఆటగాళ్లు ఉంటారు’ అని మోడి పేర్కొన్నారు. భారత్‌తో పాటు విదేశీ క్రికెటర్ల పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయని ఐపీఎల్ మాజీ కమిషన్ లలిత్ మోడి అంటున్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో నివసిస్తున్నాడు.