పాక్‌ స్పిన్‌ దిగ్గజం కన్నుమూత

Former Pakistan Spin Great Abdul Qadir Dies Of Cardiac Arrest - Sakshi

లాహోర్‌:  పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్(63) గుండెపోటుతో కన్నముశారు.  తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.  లాహోర్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్, ఉమర్ సోదరుడు కమ్రాన్ అక్మల్ ఈ వార్తను ధృవీకరించారు. దీంతో  ఖాదిర్‌ హఠాన‍్మరణంపై పలువురు క్రీడానిపుణులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన 70-80 కాలంలో, తన బౌలింగ్‌ యాక్షన్‌, మణికట్టు స్పిన్ మ్యాజిక్‌తో అద్భుత విజయాలు అందించిన ఘనత ఖాదిర్‌దేనని క్రికెట్ పండితులు, ఇతరు  అభిమానులు గుర్తు చేసుకున్నారు.  

ప్రస్తుత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు  ఎంతో ఇష్టమైన క్రికెటర్‌  అయిన  ఖాదిర్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 67 టెస్టులు, 104 వన్డేల్లో మొత్తం 368 వికెట్లు  తన ఖాతాలో వేసుకున్నారు.  ఇక లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ గుగ్లీకి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు. మరోవైపు  ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌పై ఖాదిర్‌ విసిరిన సవాలు, దాని ఎదుర్కొన్న తీరు క్రికెట్‌ అభిమానులు ఎలా మర్చిపోగలరు? 2009 లో చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచ టి 20 గెలిచిన జట్టు ఆయన ఎంపిక చేసినదే కావడం విశేషం.ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ పిసిబి చైర్మన్ ఎజాజ్ బట్‌తో విభేదాలు రావడంతో ఖాదీర్  చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశారు.

అబ్దుల్‌ ఖాదిర్‌కు భార్య, నలుగురు కుమారులు. కుమారులు రెహమాన్, ఇమ్రాన్, సులేమన్ , ఉస్మాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ స్థాయి క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించగా   ఉస్మాన్‌ ( తండ్రిలాగే లెగ్ స్పిన్నర్ కూడా) గత సీజన్లో బిగ్ బాష్ టీ 20 లీగ్‌లో కనిపించాడు. ఇతను త్వరలో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నామని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం పాక్‌ జట్టుకు ఆడుతున్న ఉమర్ అక్మల్.. ఖాదిర్‌కు స్వయానా  అల్లుడు.  ఖాదిర్  ఈనెల (సెప్టెంబర్) 15 న తన 64 వ పుట్టినరోజు జరుపుకుని వుండేవారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top