కాంస్యాలు నెగ్గిన జీతూ, హీనా | Five medals for India on day 1 of Asian Airgun Championships | Sakshi
Sakshi News home page

కాంస్యాలు నెగ్గిన జీతూ, హీనా

Dec 11 2017 4:51 AM | Updated on Dec 11 2017 4:51 AM

Five medals for India on day 1 of Asian Airgun Championships - Sakshi

వాకో సిటీ (జపాన్‌): ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత షూటర్లు ఆరు పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ జీతూ రాయ్‌ (219.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలిచాడు. టీమ్‌ విభాగంలో జీతూ రాయ్, షాజర్‌ రిజ్వీ, ఓంకార్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1735 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో హీనా సిద్ధూ (217.2 పాయింట్లు) భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. హీనా సిద్ధూ, శ్రీనివేత, హర్వీన్‌లతో కూడిన భారత బృందం (1132 పాయింట్లు) రజతం గెలిచింది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో అన్‌మోల్‌ (217.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుపొందగా.. అన్‌మోల్, గౌరవ్, అభి షేక్‌లతో కూడిన భారత జట్టు (1703 పాయిం ట్లు) రజత పతకాన్ని సొంతం చేసుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement