‘అతనొక విధ్వంసకర ఆటగాడు’

Finch will come good soon, Australia Coach Langer - Sakshi

హైదరాబాద్‌: గత కాలంగా పేలవ ఫామ్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌కు ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మద్దతుగా నిలిచాడు. అరోన్‌ ఫించ్‌ త్వరలోనే తిరిగి గాడిలో పడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అతనొక విధ్వంసకర ఆటగాడనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ఫించ్‌ ఫామ్‌ లేడు. కానీ అతను ఎంతో విలువైన ఆటగాడు. ఫామ్‌లో లేని అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

ఒకసారి ఫించ్‌ రాణించడం మొదలు పెడితే అతన్ని ఆపడం కష్టం. ఇక నాయకుడిగా కూడా ఫించ్‌ ఆకట్టుకుంటున్నాడు. జట్టులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందుకు తీసుకెళుతున్నాడు. అతనిది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం’ అని లాంగర్‌ కొనియాడాడు.ఇక రెండో టీ20లో శతకం సాధించి ఆసీస్‌ సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్‌పై కూడా లాంగర్‌ ప్రశంసలు కురిపించాడు. తమకు మ్యాక్సీ చాలా కీలక ఆటగాడని,  ఇటీవల కాలంలో అతని ఆట తీరులో మరింత నిలకడ పెరగడం ఆసీస్‌ జట్టుకు శుభపరిణామమన్నాడు. (ఇక్కడ చదవండి: కప్పుకు ముందు కంగారూ సన్నాహం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top