గిట్టనివారే ఓర్వలేకపోతున్నారు | Few underachievers want to tarnish my reputation: Leander Paes | Sakshi
Sakshi News home page

గిట్టనివారే ఓర్వలేకపోతున్నారు

Sep 20 2016 1:32 AM | Updated on Sep 4 2017 2:08 PM

గిట్టనివారే  ఓర్వలేకపోతున్నారు

గిట్టనివారే ఓర్వలేకపోతున్నారు

కొందరు గిట్టని సహచరులే తనను అదేపనిగా విమర్శిస్తున్నారని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు.

లియాండర్ పేస్ వ్యాఖ్య  
న్యూఢిల్లీ: కొందరు గిట్టని సహచరులే తనను అదేపనిగా విమర్శిస్తున్నారని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు.  ‘నా కెరీర్ ఏంటో నాకు తెలుసు, నేను సాధించిన ఘనతలు అందరికీ తెలుసు. కానీ ఇవేవీ నేనంటే గిట్టని సహచరులకు తెలియవు. 18 గ్రాండ్‌స్లామ్ (డబుల్స్, మిక్స్‌డ్) టైటిళ్లు, ఏడుసార్లు ఒలింపిక్స్ ఆడిన ఘనత వారికి కనిపించవు. వాళ్లు పది జన్మలెత్తినా ఈ ఘనతల్ని సాధించలేరు. ఇలాంటివారు టెన్నిస్ కోర్టుల్లో చెమటోడ్చలేరు కానీ విమర్శించేందుకు మాత్రం తహతహలాడుతున్నారు’ అని పేస్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement