381 నాటౌట్ | eugene created world record | Sakshi
Sakshi News home page

381 నాటౌట్

Oct 21 2014 12:48 AM | Updated on Sep 2 2017 3:10 PM

381 నాటౌట్

381 నాటౌట్

బ్రాక్‌విల్లే (కెనడా): పోటీ క్రికెట్‌లో 22 ఏళ్ల కుర్రాడు తన అసమాన ఆటతీరుతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

40 ఓవర్ల మ్యాచ్‌లో ఈగెన్ సంచలనం
 
 బ్రాక్‌విల్లే (కెనడా): పోటీ క్రికెట్‌లో 22 ఏళ్ల కుర్రాడు తన అసమాన ఆటతీరుతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం ఇక్కడ కైకోరాయ్‌తో జరిగిన మూడో గ్రేడ్ పోటీలో తైరీ జట్టు బ్యాట్స్‌మన్ కలుమ్ ఈగెన్ 381 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అతడు ఇన్ని పరుగులు చేసింది 40 ఓవర్ల మ్యాచ్‌లో.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఈగెన్ ఇన్నింగ్స్‌లో 43 సిక్సర్లు, 20 ఫోర్లున్నాయి.

బౌండరీలతోనే అతడు ట్రిపుల్ సెంచరీ (338) సాధించినట్టయ్యింది. ఇతడి జోరుతో జట్టు 40 ఓవర్లలో మూడు వికెట్లకు 510 పరుగులు సాధించించి. వాస్తవానికి 480 పరుగుల వద్దే స్కోరు షీటులో ఖాళీ లేకుండా పోయింది. గతంలో 2008-09లో హైదరాబాద్ కుర్రాడు నిఖిలేష్ సురేంద్రన్ కూడా అజేయంగా 334 పరుగులు చేసి టాపర్‌గా నిలిచాడు. కానీ గత నెలలో బ్రిస్బేన్ ఆటగాడు జేమ్స్ టుల్ కేవలం 130 బంతుల్లోనే 341 పరుగులు చేసి ఆ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు ఈగెన్ ఇన్నింగ్స్‌తో ఇది కూడా బద్దలయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement