
మూడు బంతులు... రెండు వికెట్లు
ముక్కోణపు సిరీస్లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడపడింది.
సిడ్నీ : ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే తడబడింది. పరుగుల ఖాతాను తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇయాన్ బెల్ తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. టేలర్ కూడా ఇయాన్ బెల్ బాటలోనే రెండో బంతికే వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్లోనే వీరిద్దరూ ఔట్ కావటం విశేషం. మూడు ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. ప్రస్తుతం అలి, రూట్ క్రీజ్లో ఉన్నారు.