భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్ | england to build big score, ian bell gets century | Sakshi
Sakshi News home page

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

Jan 23 2015 11:18 AM | Updated on Sep 2 2017 8:08 PM

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 35 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్  205 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ (109) సెంచరీ చేసి జట్టు కీలక  భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.

 

అతనికి జతగా రూట్(42)పరుగులతో క్రీజ్  లో ఉన్నాడు. అంతకుముందు  మొయిన్ అలీ(46), జేమ్స్ టేలర్(5) పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలిని ఆహ్వానించింది.

Advertisement
 
Advertisement
Advertisement