10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 67/1 | england got 67 runs in first ten overs | Sakshi
Sakshi News home page

10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 67/1

Jan 20 2015 1:21 PM | Updated on Sep 2 2017 7:59 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ పది ఓవర్లలో వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది.

బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.  ఇంగ్లండ్ ఓపెనర్ మహ్మద్ అలీ(8) పరుగులకే పెవిలియన్ చేరినా..  ఇయాన్ బెల్ (40), జేమ్స్ టేలర్ (17)లు బాధ్యతాయుతంగా ఆడుతున్నారు.

అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటీమిండియా 39.3 ఓవర్లకే చాపచుట్టేసింది.  ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23)  పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో ఇంగ్లండ్ కు 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.  ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లు లభించగా,  అండర్ సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
Advertisement