టెస్టుల్లో ఇంగ్లండ్‌ రికార్డు!

Edgbaston Test Against India Marks England 1000th Test Match - Sakshi

1000వ మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లీష్‌ జట్టు

బర్మింగ్‌ హోమ్‌ : ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకోనుంది. దానికి భారత్‌తో జరిగే తొలి టెస్టే వేదిక కావడం విశేషం. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 1న  ప్రారంభమయ్యే టెస్టు ఇంగ్లండ్‌కు 1000వ టెస్ట్‌. ఇప్పటికే అత్యధిక టెస్టులాడిన జట్టుగా గుర్తింపు  పొందిన ఇంగ్లండ్ ‌1000 టెస్టుల ఆడిన తొలి జట్టుగా నిలవనుంది. ఇప్పటి వరకు 999 టెస్టు మ్యాచ్‌లను ఈ ఇంగ్లీష్‌ జట్టు ఆడింది. ఈ 999 టెస్టుల్లో తన ఫేవరేట్‌ మ్యాచ్‌లు మాత్రం 2005 యాషేస్‌ సిరీస్‌.. ఎడ్జ్‌బస్టన్‌ టెస్ట్‌ అని, రెండోది 2015 ట్రెంట్‌ బ్రిడ్జ్‌ టెస్ట్‌ అని ఆజట్టు బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

అత్యధిక టెస్టులాడిన జాబితాలో ఇంగ్లండ్‌ తొలి స్థానంలో ఉండగా..812 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా, 535 మ్యాచ్‌లతో వెస్టిండీస్‌ తరువాతి స్థానంలో ఉన్నాయి. ఇక భారత్‌ 522 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌ తన తొలి టెస్టును 1877లో ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌ వేదికగా జేమ్స్‌ లిల్లీవైట్‌ సారథ్యంలో ఆడింది. 999 మ్యాచుల్లో 35.73 శాతంతో 357 మ్యాచ్‌లు గెలిచి 297 మ్యాచ్‌లు ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

చదవండి: 4 కాదు... 3 రోజులే ఈ ‘ప్రాక్టీస్‌’ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top