డ్వేన్ బ్రేవో నుంచి నటికి ఐపీఎల్ టికెట్లు | Dwayne Bravo Gives IPL Tickets To Natasha Suri | Sakshi
Sakshi News home page

డ్వేన్ బ్రేవో నుంచి నటికి ఐపీఎల్ టికెట్లు

Apr 14 2018 4:47 PM | Updated on Aug 14 2018 3:47 PM

Dwayne Bravo Gives IPL Tickets To Natasha Suri - Sakshi

సాక్షి, ముంబై : క్రికెటర్లు, బాలీవుడ్ భామలకు పరిచయాలు గురించి కొత్తగా చెప్పేదేం లేదు. చివరగా గతేడాది విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో ఓ బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా వరల్డ్‌తో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. స్వయంగా నటి ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేయడంతో వీరి డేటింగ్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నటి నటాషా సూరితో చెన్నై ప్లేయర్ బ్రేవో ముంబై హోటల్‌లో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా, ఆమెకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్రేవో అందిస్తున్నాడు. పదేళ్ల కిందట ఏర్పడిన పరిచయంతో భారత్ వచ్చిన ప్రతిసారి నటాషాను కలుస్తుంటాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ 11 సీజన్ ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్‌కు నటాషా వచ్చింది. గ్యాలరీలో కూర్చుని ఆమె సపోర్ట్ చేయగా బ్రేవో బ్యాటింగ్‌లో చెలరేగి ఆడి 30 బంతుల్లో 68 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న చెన్నైకి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 

'స్నేహితుడు బ్రేవోకు ఆల్‌ ద బెస్ట్. మ్యాచ్ చూసేందుకు నాకు స్పెషల్ టికెట్లు ఇప్పించావు. నువ్వు బాగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించావని' ఆమె పోస్ట్ చేసింది. ఆమెకు మ్యాచ్ టికెట్ల కోసం బ్రేవో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement