వలసలు దెబ్బ తీస్తున్నాయి

Du Plessis Feel Sad Over India Tour - Sakshi

2015 సిరీస్‌ అనుభవం తర్వాత స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటే చాలని ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. భారత పేసర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మా దేశ బోర్డు సరైన ముందుస్తు ప్రణాళికలతో సిద్ధం కాలేదు. ఇక భారత పర్యటన మానసికంగా మాకు మానలేని గాయాలు చేసింది. దీనినుంచి కోలుకోవడం అంత సులువు కాదు. ప్రతీసారి భారత్‌ నిర్దాక్షిణ్యంగా ఆడి భారీ స్కోర్లు నమోదు చేసింది. వాటిని చూడగానే మానసికంగా మేం బలహీనపడిపోయాం. అదే మా బ్యాటింగ్‌లో కనిపించింది. వైజాగ్‌లో తొలి ఇన్నింగ్స్‌ చాలా బాగా ఆడిన తర్వాత ఇలా జరగడం బాధాకరం. ఆ తర్వాత మేం తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాం. అయితే ప్రతీ విభాగంలో మాపై పైచేయి సాధించిన భారత జట్టును ప్రశంసించకుండా ఉండలేం. దిగ్గజ ఆటగాళ్ల స్థానంలో భవిష్యత్తు కోసం వేరేవాళ్లను తీర్చి దిద్దే ప్రయత్నం జరగలేదు. ‘కొల్పాక్‌’ ఒప్పందంతో ప్రతిభ గల మా ఆటగాళ్లంతా ఇంగ్లండ్‌కు వలస వెళ్లిపోతుండటం దేశ క్రికెట్‌ను దెబ్బ తీస్తోంది. అంతా డబ్బు మహిమ.
–డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top