
‘డీఆర్‌ఎస్’ మరో ముందడుగు: సచిన్
భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్) అమలు చేయడాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వాగతించారు.
భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్) అమలు చేయడాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్వాగతించారు. బీసీసీఐ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం మరో మంచి ముందడుగుగా ఆయన అభివర్ణించారు. లోపాలు లేని డీఆర్‌ఎస్‌కు తన మద్దతు పలికి?న సచిన్... టెక్నాలజీ విషయంలో టెస్టుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఒక చోట స్నికో మీటర్, మరో చోట హాట్‌స్పాట్ వాడటానికి తాను వ్యతిరేకమన్నారు.