అదరగొట్టిన ‘వాల్‌’ వారసుడు!

Dravid Son Produces Match Winning Performance in Under-14 Cricket - Sakshi

బెంగళూరు : టీమిండియా వాల్‌, దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడు సమిత్‌ ద్రవిడ్‌ అదరగొట్టాడు. ఇప్పటి వరకు క్రికెటర్ల తనయుల పేర్లలో సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ పేరే వినిపించగా.. తాజాగా ద్రవిడ్‌ కొడుకు సైతం వార్తల్లో నిలిచాడు. బెంగళూరులో జరిగిన అండర్‌-14 టోర్నీలో ఈ 12 ఏళ్ల చిన్న ద్రవిడ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అధితి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ తరపున బరిలోకి దిగిన సమిత్‌ అర్థ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి విజయం కీలక పాత్ర పోషించాడు. దీంతో కెంబ్రిడ్జి పబ్లిక్‌ స్కూల్‌పై సమిత్‌ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ద్రవిడ్‌ అండర్‌-19 కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అండర్‌ 19 కోచ్‌ పెద్దకొడుకైన సమిత్‌.. ఇలా ఆకట్టుకోవడం ఇదే తొలిసారేం కాదు. జనవరిలో కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్స్‌ (కేఎస్‌సీఏ) నిర్వహించిన బీటీఆర్‌ కప్‌లో సమిత్‌ 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అండర్‌-12 టోర్నీల్లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు కూడా పొందాడు. 2015లో అండర్‌-12 గోపాలన్‌ క్రికెట్‌ చాలెంజ్‌ పోటీల్లో బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక సచిన్‌ కుమారుడు అర్జున్‌ శ్రీలంక పర్యటనలోని భారత అండర్‌-19 జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.

చదవండి: ద్రవిడ్‌కు గొప్ప బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన కొడుకు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top