ముందుగా స్పష్టతనివ్వండి | Dravid asks BCCI for clarity on conflict of interest | Sakshi
Sakshi News home page

ముందుగా స్పష్టతనివ్వండి

Jun 10 2017 1:02 AM | Updated on Sep 5 2017 1:12 PM

ముందుగా స్పష్టతనివ్వండి

ముందుగా స్పష్టతనివ్వండి

పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి భారత్‌ ‘ఎ’ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరింత స్పష్టత కోరుతున్నారు.

కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌పై రాహుల్‌ ద్రవిడ్‌  

ముంబై: పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి భారత్‌ ‘ఎ’ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరింత స్పష్టత కోరుతున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మెంటార్‌గా వ్వవహరిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌ ‘కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’పై బీసీసీఐని స్పష్టతను కోరారు. బీసీసీఐతో ఆయనకు పది నెలల ఒప్పందమే ఉంది కాబట్టి ఆ తర్వాత ఐపీఎల్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

‘ఈ విషయంలో ఇప్పటికే నా పరిస్థితి గురించి సీఓఏకు లేఖ రాశాను. బీసీసీఐకి సంబంధించిన కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ నిబంధనల ప్రకారం నేను ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు. అయితే మధ్యలో ఏమైనా రూల్స్‌ మార్చడం జరిగితే మాత్రం నన్ను విమర్శించడం సరికాదు. అందుకే ఈ అంశంపై మాకు స్పష్టత కావాలి. ఆ తర్వాతే మేం ఒక నిర్ణయం తీసుకోగలం’ అని ద్రవిడ్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement