టొరంటో మాస్టర్స్ ఫైనల్లోకి జొకోవిచ్ | Djokovic Enters Toronto Masters Final, Sets Up Clash With Kei Nishikori | Sakshi
Sakshi News home page

టొరంటో మాస్టర్స్ ఫైనల్లోకి జొకోవిచ్

Jul 31 2016 12:51 PM | Updated on Sep 4 2017 7:13 AM

టొరంటో మాస్టర్స్ ఫైనల్లోకి జొకోవిచ్

టొరంటో మాస్టర్స్ ఫైనల్లోకి జొకోవిచ్

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ టొరంటో మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

టొరంటో: ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ టొరంటో మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో 6-3, 6-2 తేడాతో గేల్ మోనఫిల్స్ ను మట్టికరిపించాడు.  మాస్టర్స్ ఈవెంట్లో గత 15 మ్యాచులలో 14వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 74 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో రెండు సెట్లలోనూ జొకోకు ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు.

టోర్నీలో గత అన్ని మ్యాచులలో చెమటోడ్చి నెగ్గిన జొకో సెమిస్ లో మాత్రం సునాయసంగా గెలుపొందాడు. ఫైనల్లో జపాన్ సంచలనం నిషికోరితో తలపడనున్నాడు. గతేడాది మియామీ టోర్నీలో నిషికోరిపై జొకోవిచ్ గెలుపొందిన విషయం తెలిసిందే. మరో సెమిఫైనల్లో స్విట్జర్లాండ్ కు చెందిన స్టాన్ వావ్రింకాను 7-6(8/6), 6-1తో వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్లో చెమటోడ్చిన నిషికోరికి రెండో సెట్లో వావ్రింకా నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో సులువుగా సెట్ కైవసం చేసుకుని ఫైనల్లోకి ప్రవేశించాడు.

Advertisement
 
Advertisement
Advertisement