అవసరమైతే వస్తా... | Divij Sharan's decision against travelling with Davis Cup team | Sakshi
Sakshi News home page

అవసరమైతే వస్తా...

Apr 2 2018 4:41 AM | Updated on Apr 2 2018 4:41 AM

Divij Sharan's decision against travelling with Davis Cup team - Sakshi

న్యూఢిల్లీ: తుది జట్టులో ఆడే అవకాశం లేకపోవడం తో... ఆ సమయాన్ని అమెరికాలో ప్రాక్టీస్‌ చేసుకునేందుకు కేటాయించాలని భారత డబుల్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ దివిజ్‌ శరణ్‌ నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఈనెల 6, 7 తేదీల్లో చైనాతో జరిగే డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌ ఆడేందుకు చైనా వెళ్లడం లేదని తెలిపాడు.

డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌–బోపన్న జంట బరిలోకి దిగడం ఖాయం కాబట్టి దివిజ్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రావడం కష్టమే. ఈ మేరకు దివిజ్‌ తన నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ–ఐటా) అధికారులకు తెలపగా... వారు దానికి అంగీకరించారు. తన అవసరం ఉంటే వెంటనే చైనాకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నానని దివిజ్‌ తెలిపాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement