గంభీర్‌పై వెంగ్‌సర్కార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Dilip Vengsarkar Said Gambhir Couldnt Control His Anger And Emotion - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌పై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌ చాలా ప్రతిభ కలిగిన ఆటగాడని, కీలక సమయాల్లో రాణించి టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడని కీర్తించాడు. అయితే మైదానం లోపల, వెలుపల కోపాన్ని, ఎమోషన్స్‌ను నియంత్రించుకోలేడని పేర్కొన్నాడు. ఒక వేళ తన పద్దతి మార్చుకొని ఉంటే టీమిండియా తరుపున మరిన్ని మ్యాచ్‌లు ఆడేవాడని వెంగ్‌సర్కార్‌ అభిప్రాయపడ్డాడు. 

టీమిండియా రెండు ప్రపంచకప్‌లు(టీ20, వన్డే) గెలవడంలో గౌతమ్‌ గంభీర్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. టెస్టుల్లోనూ కొన్ని నెలల పాటు నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగాడు. టీమిండియా ఆగ్రశ్రేణి ఓపెనర్‌గా ఎదిగిన గంభీర్‌కు అతడి కోపం, ఎమోషన్సే కొంప ముంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో విరాట్‌ కోహ్లితో గొడవ, ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో వాగ్వాదం వంటివి గంభీర్‌ కెరీర్‌కు మచ్చగా మిగిలిపోయాయి. 

ఇక తాజాగా ఓ డిబేట్‌లో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పై గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  జట్టులో నుంచి తొలగించేముందు ఆటగాళ్లకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డాడు. తనతో పాటు యువీ, రైనా విషయంలో కూడా ఇలాగే జరిగిందని ప్రసాద్‌ను కడిగిపడేశాడు. 2003లో టీమిండియా తరుపున అరంగేట్రం చేసిన గంభీర్‌ 15 ఏళ్ల పాటు సుదీర్ఘ క్రికెట్‌ ఆడి 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 

చదవండి:
నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌
‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top