ఆకట్టుకున్న దిలీప్‌ కుమార్‌

Dileep Kumar shines in Sailing Championship 4th day - Sakshi

సీనియర్‌ మల్టీకాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ మల్టీకాస్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ నాలుగోరోజు పోటీల్లో ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ (ఈఎంఈఎస్‌ఏ) క్రీడాకారుడు దిలీప్‌ కుమార్‌ ఆకట్టుకున్నాడు. లేజర్‌ రేడియల్‌ విభాగంలో జరిగిన పోటీల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. శనివారం జరిగిన మూడు రేసుల్లో రెండింటిలో తొలి మూడు స్థానాల్లో నిలిచాడు. పదో రేస్‌లో రన్నరప్‌గా నిలిచిన దిలీప్‌... పదకొండో రేస్‌లో మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పన్నెండో రేస్‌లో వాతావరణంతో పాటు గాలి గమనంలో విపరీతమైన మార్పులు రావడంతో దిలీప్‌ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మెరుగైన స్థానంలో నిలిచాడు. ఆర్‌ఎస్‌: ఎక్స్‌ ఈవెంట్‌లోనూ ఈఎంఈఎస్‌ఏ సెయిలర్‌ కమలపతి ఓజా రాణించాడు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

లేజర్‌ స్టాండర్డ్‌

రేస్‌–10: 1. మోహిత్‌ సైనీ (ఏవైఎన్‌), 2. గితేశ్‌ (ఏవైఎన్‌), 3. హర్‌ప్రీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌).
రేస్‌–11: 1. బి. మోహపాత్ర (ఏవైఎన్‌), 2. మోహిత్‌ సైనీ (ఏవైఎన్‌), 3. ఉపమన్యు దత్తా (ఐఎన్‌డబ్ల్యూటీసీ).
రేస్‌–12: 1. బి. మోహపాత్ర (ఏవైఎన్‌), 2. బీకే రౌత్‌ (ఈఎంఈఎస్‌ఏ), 3. హర్‌ప్రీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌).

లేజర్‌ రేడియల్‌

రేస్‌–10: 1. ఇస్రాజ్‌ అలీ (ఏవైఎన్‌), 2. దిలీప్‌ కుమార్‌ (ఈఎంఈఎస్‌ఏ), 3. గితేశ్‌ (ఏవైఎన్‌).
రేస్‌–11: 1. జస్వీర్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 2. ఎం. కోటేశ్వరరావు (టీఎస్‌సీ), 3. దిలీప్‌ కుమార్‌ (ఈఎంఈఎస్‌ఏ).
రేస్‌–12: 1. రమ్య (ఏవైఎన్‌), 2. తను (ఎన్‌ఎస్‌ఎస్‌), 3. చింతన్‌ (ఈఎన్‌డబ్ల్యూటీసీ).
ఆర్‌ఎస్‌: ఎక్స్‌

రేస్‌–10: 1. జెరోమ్‌ కుమార్‌ (ఏవైఎన్‌), 2. మన్‌ప్రీత్‌సింగ్‌ (ఏవైఎన్‌), 3. మనోజ్‌ కుమార్‌ (ఏవైఎన్‌).
రేస్‌–11: 1. జెరోమ్‌ కుమార్‌ (ఏవైఎన్‌), 2. కమలపతి (ఈఎంఈఎస్‌ఏ).
రేస్‌–12: 1. జెరోమ్‌ కుమార్‌ (ఏవైఎన్‌), 2. కేదార్‌నాథ్‌ తివారీ (ఈఎంఈఎస్‌ఏ), 3. మన్‌ప్రీత్‌ (ఏవైఎన్‌).
ఫిన్‌
రేస్‌–10: 1. గుర్జీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 2. ఎంకే యాదవ్‌ (ఏవైఎన్‌), 3. వివేక్‌ (ఏవైఎన్‌).
రేస్‌–11: 1. గుర్జీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 2. నవీన్‌ కుమార్‌ (ఏవైఎన్‌), 3. వివేక్‌ (ఏవైఎన్‌).
రేస్‌–12: 1. స్వతంత్ర సింగ్‌ (ఏవైఎన్‌), 2. గుర్జీత్‌ సింగ్‌ (ఏవైఎన్‌), 3. నవీన్‌ (ఏవైఎన్‌).
లేజర్‌ 4.7
రేస్‌–10: 1. కె. గౌతమ్‌ (వైసీహెచ్‌), 2. రామ్‌ మిలన్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 3. ఎన్‌. హేమంత్‌ (టీఎస్‌సీ).
రేస్‌–11: 1. రామ్‌ మిలన్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 2. ఆశిష్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 3. సతీశ్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌).
రేస్‌–12: 1. నవీన్‌ కుమార్‌ (టీఎన్‌ఎస్‌ఏ), 2. రామ్‌ మిలన్‌ యాదవ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌), 3. కె. గౌతమ్‌ (వైసీహెచ్‌).  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top