'ధోనీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది'

'ధోనీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది'


న్యూఢిల్లీ: గబ్బా స్డేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలు వస్తున్నాయి. అయితే, బౌలర్ల వైఫల్యం వెంటాడుతుండటంతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ వైఫల్యాల ప్రభావం ధోనిపై ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ ధోనీ గత రెండు వన్డేల్లోనూ నిరాశపరిచాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ధోనీకి మరింత టైమ్ ఇవ్వాలని, అతడు త్వరలోనే క్రీజులో కుదురుకుంటాడని కెప్టెన్ కు మద్దతు తెలిపాడు. కానీ, ధోనీ చివరి ఐదు ఇన్నింగ్స్ స్కోర్లు వరుసగా 47, 15, 27, 18, 11 మాత్రమే ఉండటం బ్యాటింగ్లోనూ అతని వైఫల్యాన్ని తెలుపుతుంది. మిస్టర్ కూల్ గా పేరుగాంచిన ధోనికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పుకొచ్చారు. టెస్టులకు గుడ్ బై చెప్పిన ధోనీ, గతేడాది అక్టోబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండటం ఓ కారణమై ఉండవచ్చు అన్నారు.



భారత బౌలర్లలో ఒక్కరి ఎకానమీ రేట్ 5.5 కంటే తక్కువ లేదని, దీంతో ఆసీస్ 309 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేజ్ చేసిందని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా వికెట్లు తీయడానికి బౌలర్లు మరింతగా సాధన చేయాలని సూచించారు. వైడ్స్, నో బాల్స్ ఎక్కువ ఇస్తున్నారని, ఈ అదనపు పరుగులు కంట్రోల్ చేయాలన్నాడు. గత కొన్ని మ్యాచ్లను గమనిస్తే వన్ మ్యాన్ షో విన్ భారత్కు దక్కలేదని, బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులు విసరాలని చెప్పాడు. ఏది ఏమైతేనేం బ్రిస్బేన్ లో ఆసీసీ ఛేదనను గవాస్కర్ ప్రశంసించాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ ఆధిపత్యాన్ని మనం కచ్చితంగా కట్టడి చేసి తీరితేనే భారత్ విజయాలు సాధిస్తుందని జట్టుకు సునీల్ గవాస్కర్ విలువైన సూచనలిచ్చాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top