బౌలింగ్‌లో పరిణితి సాధించావు: ధోనీ

Dhoni Praises Shahbad Nadeem - Sakshi

న్యూఢిల్లీ: లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాహబాద్‌ నదీమ్‌పై టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో నదీమ్‌ అరంగేట్రం చేశాడు. కాగా, ఆడిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి అందరిని అబ్బురపరిచాడు. అయితే, మ్యాచ్‌ పూర్తయిన తర్వాత నదీమ్‌ ధోనిని కలిశాడు. వీరిద్దరు రాంచీ క్రికెట్‌ జట్టులో సభ్యులు కావడం విశేషం. నదీమ్‌ మీడియాతో మాట్లాడుతూ బౌలింగ్‌లో ఎంతో పరిణితి సాధించావంటూ ధోనీ కొనియాడడని తెలిపాడు.

భుజం నొప్పి కారణంగా కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో తనను ఎంపిక చేశారని అన్నాడు. జట్టు మెనేజ్‌మెంట్‌ పిలుపుతో కేవలం 24గంటల వ్యవదిలోనే కోల్‌కతా నుంచి రాంచీకి బయలుదేరానని అన్నాడు.  నా ఆటతీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని, ఇదే ఆటతీరును భవిష్యత్తులో కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తన బౌలింగ్‌ పరిణితి చెందడానికి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఎంతో దోహదపడిందని ధోనీ అభిప్రాయపడ్డాడని నదీమ్‌ పేర్కొన్నాడు. కాగా, వీరు రాంచీ మైదానంలో ముచ్చటిస్తున్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో ఫోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top