9, 0, 5, 6, 0, 0 | Delhi top order duck out | Sakshi
Sakshi News home page

9, 0, 5, 6, 0, 0

Apr 22 2017 11:00 PM | Updated on Sep 5 2017 9:26 AM

9, 0, 5, 6, 0, 0

9, 0, 5, 6, 0, 0

ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాప్ 3 బ్యాట్స్ మెన్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

ముంబై: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు స్కోర్లు ఇలా ఉన్నాయి. ముగ్గురు టాపార్డర్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మరో ముగ్గురు బ్యాట్స్ మెన్స్ డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్, ఆదిత్యా తారే, అండర్సన్ లు ఖాతా తెరవకుండానే సున్నా పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. సంజూ శాంసన్ (9), కరణ్ నాయర్ (5), శ్రేయస్ అయ్యర్ లు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు.
 
బౌలింగ్ తో ముంబై టాప్ ఆర్డర్ ను దెబ్బతీసిన ఢిల్లీ, అదే తరహాలో ముంబై బౌలర్ల ముందు తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 143 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి నిర్దేశించింది. 144 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. ఈ క్రమంలో ముంబై బౌలర్లు మెక్ క్లినగన్ మూడు వికెట్లు పడగొట్టగా,  హార్ధిక్ పాండ్యా, బుమ్రా చెరో వికెట్ దక్కంచుకున్నారు. పాండ్యా తారేను రనౌట్ చేశాడు. ముంబై 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement