రాజస్తాన్‌ లక్ష్యం​ 177 | CSK set target of 177 runs against Rajasthan Royals | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ లక్ష్యం​ 177

May 11 2018 9:50 PM | Updated on May 11 2018 9:59 PM

CSK set target of 177 runs against Rajasthan Royals - Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ 19 పరుగుల వద్ద అంబటి రాయడు(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మరో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్‌ 86 పరుగుల భాగస‍్వామ్యాన్ని సాధించిన తర్వాత వాట్సన్‌(39; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై రైనాకు ఎంఎస్‌ ధోని జత కలిశాడు.

కాగా, హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన తర్వాత రైనా(52;35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను మరోసారి భుజాలపై వేసుకున్న ధోని సమయోచితంగా ఆడాడు. సామ్‌ బిల్లింగ్స్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోని(33 నాటౌట్‌; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌),  సామ్‌ బిల్లింగ్స్‌(27;‌ 22 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడారు.  ఫలితంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, ఇష్‌ సోథీకి వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement