'2019 ప్రపంచ కప్లో ఆడుతా' | Confident of playing for India in 2019 World Cup: Sreesanth | Sakshi
Sakshi News home page

'2019 ప్రపంచ కప్లో ఆడుతా'

Aug 4 2015 6:10 PM | Updated on Sep 3 2017 6:46 AM

'2019 ప్రపంచ కప్లో ఆడుతా'

'2019 ప్రపంచ కప్లో ఆడుతా'

కేరళ పేసర్ శ్రీశాంత్ మళ్లీ భారత జట్టులోకి వస్తానని, 2019లో జరిగే ప్రపంచ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

గురువాయుర్: జీవితకాల నిషేధం తొలగించే విషయంలో బీసీసీఐ నుంచి సానుకూల స్పందన రాకపోయినా.. కేరళ పేసర్ శ్రీశాంత్ మాత్రం మళ్లీ భారత జట్టులోకి వస్తానని, 2019లో జరిగే ప్రపంచ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మంగళవారం కేరళలోని ప్రఖ్యాత గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న శ్రీశాంత్.. బీసీసీఐ తనపై నిషేధం ఎత్తివేస్తుందనే నమ్మకముందని చెప్పాడు.

2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన తర్వాత శ్రీశాంత్పై బోర్డు జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు శ్రీశాంత్ సహా అంకిత్ చవాన్, చండీలాను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో తమపై నిషేధం తొలగించాలని క్రికెటర్లు కోరుతున్నాబోర్డు విముఖత వ్యక్తం చేసింది. 'బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా. బోర్డులో సహృదయం గల వ్యక్తులు ఉన్నారు. ఈవాళ కాకపోతే రేపయినా నిషేధం తొలగిపోతుంది. 2019 ప్రపంచ కప్లో టీమిండియా తరపున ఆడుతాననే నమ్మకముంది. ఇది సాధ్యంకాకపోతే కనీసం కేరళ జట్టు తరపున ఆడుతా' అని శ్రీశాంత్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement