సిటీ పోలీస్ జట్టుకు మూడో స్థానం | city police team in third place position | Sakshi
Sakshi News home page

సిటీ పోలీస్ జట్టుకు మూడో స్థానం

Mar 19 2014 12:15 AM | Updated on Sep 19 2018 6:31 PM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ కబడ్డీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కబడ్డీ ఈవెంట్‌లో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ కబడ్డీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కబడ్డీ ఈవెంట్‌లో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. సిటీ పోలీస్ జట్టు 32-34తో ఆతిథ్య వైజాగ్ చేతిలో పోరాడి ఓడింది.
 
 తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరు జట్లు 17-17తో సమవుజ్జీగా నిలిచాయి. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిటీ పోలీస్ జట్టు 41-22తో వరంగల్ రేంజ్ పోలీస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. సిటీ జట్టుకు జూబ్లీహిల్స్ ఎస్‌ఐ మహేందర్ రెడ్డి కెప్టెన్‌గా, శ్రవణ్ కుమార్ కోచ్‌గా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement