50 కి.మీ. నడక...

Chinese woman sets record for 50K race walk - Sakshi

3 గం. 59 ని. 15 సెకన్లలో 

చైనా వాకర్‌ లియు హాంగ్‌   కొత్త ప్రపంచ రికార్డు  

బీజింగ్‌: మహిళల 50 కిలోమీటర్ల నడక విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. చైనాలోని హువాంగ్‌షన్‌ పట్టణంలో శనివారం జరిగిన చైనీస్‌ రేస్‌ వాక్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో చైనాకు చెందిన లియు హాంగ్‌ ఈ ఘనత సాధించింది. 50 కిలోమీటర్ల దూరాన్ని లియు హాంగ్‌ 3 గంటల 59 నిమిషాల 15 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచింది.

4 గంటల 4 నిమిషాల 36 సెకన్లతో ఇప్పటిదాకా లియాంగ్‌ రుయి (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును లియు హాంగ్‌ బద్దలు కొట్టింది. 50 కిలో మీటర్ల గమ్యాన్ని 4 గంటల్లోపు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 31 ఏళ్ల లియు హాంగ్‌ 2016 రియో ఒలింపిక్స్‌లో 20 కిలోమీటర్ల విభాగంలో... 2011, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top