లెక్‌లెర్క్‌దే టైటిల్‌

Charles Leclerc Wins Ferrari's 1st Italian GP - Sakshi

ఇటలీ గ్రాండ్‌ ప్రి

మోంజా (ఇటలీ): ఫార్ములావన్‌ ట్రాక్‌పై దూసుకొచ్చిన కొత్త సంచలనం చార్లెస్‌ లెక్‌లెర్క్‌. ఈ ఫెరారీ డ్రైవర్‌ గతవారం బెల్జియం గ్రాండ్‌ ప్రి గెలిచాడు. ఈ వారమిక్కడ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. తాజాగా మరో ఫార్ములావన్‌ను కైవసం చేసుకున్నాడు. ఫెరారీ సొంతగడ్డ అయిన ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవరే అందనంత వేగంతో దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో అతను విజేతగా నిలిచాడు.  ఇటాలియన్‌ సర్క్యూట్‌పై మెరుపువేగాన్ని కనబరిచాడు.

53 ల్యాపుల రేసును ఒక గంటా 15 నిమిషాల 26.665 సెకన్లలో పూర్తి చేశాడు. ఆరంభం నుంచి గట్టి పోటీనిచ్చిన మెర్సిడెస్‌ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్‌లను మట్టికరిపించాడు. అతని వేగానికి 0.835 సెకన్ల తేడాతో బొటాస్‌ రెండు, 35.199 సెకన్లతో హామిల్టన్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. లెక్‌లెర్క్‌ విజయంతో ఫెరారీ జట్టుకు సొంతగడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత టైటిల్‌ దక్కింది. అయితే ఫెరారీ మరో డ్రైవర్, మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌కు ఇక్కడ నిరాశే ఎదురైంది. పుంజుకోలేని వేగం, తడబాటుతో అతను 52 ల్యాపుల్ని పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్‌ గ్రాండ్‌ప్రి ఈ నెల 22న జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top