జూన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ధోని తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని అతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ
కోల్‌కతా: జూన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ధోని తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని అతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతానికి ధోని దృష్టంతా ఆ టోర్నీపైనే ఉంది.
అందులో బాగా ఆడగలిగితే 2019 వరల్డ్ కప్ వరకు కూడా కొనసాగవచ్చు. వయసు పెరిగింది కాబట్టి ఆటలో ధాటి తగ్గడం కూడా సహజం. అయితే ఎవరూ వేలెత్తి చూపక ముందే తన గురించి నిర్ణయం తీసుకోగలడు’ అని బెనర్జీ వ్యాఖ్యానించారు.