కరోలినా మారిన్కు షాక్ | Carolina Marin shocked in Hong Kong Open badminton semis | Sakshi
Sakshi News home page

కరోలినా మారిన్కు షాక్

Nov 26 2016 1:50 PM | Updated on Sep 2 2018 3:19 PM

కరోలినా మారిన్కు షాక్ - Sakshi

కరోలినా మారిన్కు షాక్

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్కు షాక్ తగిలింది.

కౌలూన్:హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్కు షాక్ తగిలింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో మారిన్ 17-21, 21-14, 16-21 తేడాతో తాయ్ జు యింగ్(తైవాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్లో ఓటమి పాలై వెనుకబడిన మారిన్.. రెండో గేమ్ను అవలీలగా సొంతం చేసుకుంది.


అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో మారిన్ అనవసర తప్పిదాలు చేసి ఆ గేమ్ను చేజార్చుకుని పరాజయం చెందింది. దాంతో రియో ఒలింపిక్స్ స్వర్ణం తరువాత తొలిసారి ఫైనల్కు చేరాలనుకున్న మారిన్ ఆశలకు బ్రేక్ పడింది. గత రెండు వారాల్లో తాయ్ చేతిలో మారిన్ ఓటమి పాలుకావడం రెండోసారి.  ఇటీవల జరిగిన చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మారిన్ను తాయ్ ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement