కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో జీవన్‌  | Career best ATP doubles ranking of 68 for Jeevan Nedunchezhiyan | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో జీవన్‌ 

Mar 5 2019 1:00 AM | Updated on Mar 5 2019 1:00 AM

Career best ATP doubles ranking of 68 for Jeevan Nedunchezhiyan  - Sakshi

న్యూఢిల్లీ: గతవారం దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌ చేరినందుకు భారత డబుల్స్‌ ప్లేయర్‌ జీవన్‌ నెడుంజెళియన్‌కు తగిన ఫలితం లభించింది. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో జీవన్‌ తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. చెన్నైకు చెందిన 30 ఏళ్ల జీవన్‌ భారత్‌కే చెందిన పురవ్‌ రాజాతో కలిసి దుబాయ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో 75వ స్థానంలో ఉన్న జీవన్‌ ఏడు స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌లో నిలిచాడు. పురవ్‌ రాజా 17 స్థానాలు పురోగతి సాధించి 79వ ర్యాంక్‌కు చేరాడు. రోహన్‌ బోపన్న 38వ స్థానంలో... దివిజ్‌ శరణ్‌ 40వ స్థానంలో... లియాండర్‌ పేస్‌ 96వ స్థానంలో ఉన్నారు. సింగిల్స్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ మూడు స్థానాలు పడిపోయి 97వ ర్యాంక్‌లో నిలిచాడు.   

Advertisement
 
Advertisement
Advertisement