హైదరాబాద్ ఓటమి | Buchi babu cricket tournemt hyderabad team lost first game | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఓటమి

Aug 17 2013 12:33 AM | Updated on Sep 1 2017 9:52 PM

బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. హర్యానా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 38 ఓవర్లలో ఆరు వికెట్లకు 215 పరుగులు చేసింది.

చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. హర్యానా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్యానా 38 ఓవర్లలో ఆరు వికెట్లకు 215 పరుగులు చేసింది.
 
 భారత జట్టు మాజీ కెప్టెన్ అజయ్ జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. నింపాదిగా ఆడిన ఈ హర్యానా కెప్టెన్ రెండు బౌండరీల సహాయంతో 37 పరుగులు చేశాడు. నాలుగో వికెట్‌కు ఓపెనర్ సన్నీ సింగ్‌తో కలిసి 75 పరుగులు జోడించాడు. అనంతరం హైదరాబాద్ 37.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
 
 సంక్షిప్త స్కోర్లు
 హర్యానా ఇన్నింగ్స్: 215/6 (38 ఓవర్లలో) (సన్నీ సింగ్ 82, నితిన్ సైని 36, అజయ్ జడేజా 37, సి.వి.మిలింద్ 2/42, అన్వర్ ఖాన్ 2/45) హైదరాబాద్ ఇన్నింగ్స్: 153 ఆలౌట్ (37.3 ఓవర్లలో) (హనుమ విహారి 45, అమోల్ షిండే 32, ఆశిష్ హుడా 3/12, కుల్‌దీప్ హుడా 2/34, సంజయ్ బుధ్వార్ 2/47, రాహుల్ తెవతియా 2/20).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement