వినోద్, బజరంగ్‌ ‘కంచు’మోత 

Bronze medals were achieved the Bajrang punia and vinod - Sakshi

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు బజరంగ్‌ పూనియా (60 కేజీలు), వినోద్‌ కుమార్‌ ఓంప్రకాశ్‌ (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక బౌట్‌లలో బజరంగ్‌ 10–4తో యూనిస్‌ అలీఅక్బర్‌ (ఇరాన్‌)పై గెలుపొందగా... వినోద్‌ ఆతిథ్య దేశానికి చెందిన ఎలామన్‌ డాగ్‌డుర్‌బెక్‌ను ఓడించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో బజరంగ్‌ 5–7తో దైచి తకతాని (జపాన్‌) చేతిలో... వినోద్‌ 3–6తో నవ్రుజోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.

అయితే తకతాని, నవ్రుజోవ్‌ ఫైనల్‌కు చేరడంతో బజరంగ్, వినోద్‌లకు కాంస్య పతకాల కోసం నిర్వహించే రెప్‌చేజ్‌ రౌండ్‌లలో పోటీపడే అవకాశం లభించింది. రెప్‌చేజ్‌ తొలి రౌండ్‌లో బజరంగ్‌ 12–2తో అబ్దుల్‌ (తజికిస్తాన్‌)పై నెగ్గి కాంస్యం కోసం అలీఅక్బర్‌తో పోటీపడ్డాడు. వినోద్‌కు నేరుగా కాంస్యపతక బౌట్‌ ఆడే అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణం, రజతంతోపాటు ఆరు కాంస్యాలు లభించాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top