
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. క్రొయేషియాలో గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ పంఘాల్ కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక బౌట్‌లో హరియాణాకు చెందిన 21 ఏళ్ల అంతిమ్ 9–1తో ఎమ్మా జోనా డెనిస్ మాల్ ్మగ్రెన్ (స్వీడన్)పై గెలుపొందింది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అంతిమ్‌కిది రెండో పతకం, 2023లోనూ ఆమె కాంస్యం సాధించింది.
వినేశ్ ఫొగాట్ (2019, 2022లలో కాంస్యం) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు పతకాలు గెలిచిన రెండో భారతీయ మహిళా రెజ్లర్‌గా అంతిమ్ గుర్తింపు పొందింది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ పోటీల్లో భారత్ నుంచి అల్కా (2006లో కాంస్యం), బబిత (2012లో కాంస్యం), గీతా ఫొగాట్ (2012లో కాంస్యం), పూజ (2018లో కాంస్యం), అన్షు (2021లో రజతం), సరిత (2021లో కాంస్యం), మాన్సి (2024లో కాంస్యం) కూడా పతకాలు నెగ్గారు.