‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్ | Bowler Cheepurupalli Stephen selected for MRF Pace Foundation Training | Sakshi
Sakshi News home page

‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్

Apr 8 2015 1:40 AM | Updated on Jun 2 2018 2:19 PM

‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్ - Sakshi

‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్

ప్రఖ్యాత ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందేందుకు ఆంధ్ర క్రికెట్ జట్టు బౌలర్ చీపురుపల్లి స్టీఫెన్ ఎంపికయ్యాడు.

సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందేందుకు ఆంధ్ర క్రికెట్ జట్టు బౌలర్ చీపురుపల్లి స్టీఫెన్ ఎంపికయ్యాడు. పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ దగ్గర స్టీఫెన్ శిక్షణ తీసుకుంటాడు. ఈ నెల 15నుంచి ఈ శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంనకు చెందిన 21 ఏళ్ల స్టీఫెన్ గత రెండు సీజన్లుగా ఆంధ్ర జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 24.87 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణకు ఎంపికైన స్టీఫెన్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అభినందించింది.

Advertisement
 
Advertisement
Advertisement