బోపన్న-ఖురేషి జోడికి దుబాయ్ ఓపెన్ టైటిల్ | boppana-kureshi win adubai tittle | Sakshi
Sakshi News home page

బోపన్న-ఖురేషి జోడికి దుబాయ్ ఓపెన్ టైటిల్

Mar 2 2014 1:10 AM | Updated on Sep 2 2017 4:14 AM

బోపన్న-ఖురేషి జోడికి దుబాయ్ ఓపెన్ టైటిల్

బోపన్న-ఖురేషి జోడికి దుబాయ్ ఓపెన్ టైటిల్

ఏటీపీ వరల్డ్ టూర్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)- ఐసాముల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) జోడి సత్తా చాటింది. శనివారం ఇక్కడ ముగిసిన దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ఈ జంట సొంతం చేసుకుంది.

 దుబాయ్: ఏటీపీ వరల్డ్ టూర్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)- ఐసాముల్ హక్ ఖురేషి (పాకిస్థాన్) జోడి సత్తా చాటింది. శనివారం ఇక్కడ ముగిసిన దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ఈ జంట సొంతం చేసుకుంది.

 

68 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో రెండో సీడ్ బోపన్న- ఖురేషి ద్వయం 6-4, 6-3తో టాప్ సీడ్ డానియల్ నెస్టర్ (కెనడా)- నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జోడిపై విజయం సాధించింది. ఓవరాల్‌గా ఇది బోపన్న, ఖురేషి కలిసి గెలుచుకున్న ఐదో ఏటీపీ టైటిల్ కాగా, ఇటీవలే మళ్లీ జత కట్టిన తర్వాత మొదటిది. 2011 నవంబర్‌లో పారిబా మాస్టర్స్ నెగ్గిన తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

 

తాజా విజయంతో ఈ జోడికి 1,37,620 డాలర్లు (రూ. 85 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. 2012లోనూ బోపన్న మహేశ్ భూపతితో కలిసి దుబాయ్ ఓపెన్‌ను నెగ్గాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement