
ట్రినిడాడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ గెలుపును అందుకుని సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా విజయంలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. కాగా, భువీ పట్టిన రిటర్న్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.(ఇక్కడ చదవండి: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు!)
భువీ వేసిన 35 ఓవర్ ఐదో బంతిని రోస్టన్ ఛేజ్ లెగ్ సైడ్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని రిట్నర్ క్యాచ్‌గా రాగా దాన్ని భువీ డైవ్ కొట్టి అద్భుతంగా అందుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లు రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడం అంత ఈజీ కాదు. బంతిని వేసిన తర్వాత తనను తాను నియంత్రించుకుంటూ భువీ చాకచక్యంగా క్యాచ్‌ను పట్టుకున్నాడు. దాంతో కెప్టెన్ కోహ్లితో సహా సహచర ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు.