భవన్స్‌ జట్టుకు టైటిల్‌ | Bhavans team got title | Sakshi
Sakshi News home page

భవన్స్‌ జట్టుకు టైటిల్‌

Feb 12 2018 10:32 AM | Updated on Feb 12 2018 10:32 AM

Bhavans team got title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి పురుషుల క్యారమ్స్‌ టోర్నమెంట్‌లో సికింద్రాబాద్‌ భవన్స్‌ సైనిక్‌పురి డిగ్రీ కాలేజి జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. గండిపేట్‌ సీబీఐటీ కాలేజి ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ఎంజేసీఈటీ రన్నరప్‌గా నిలవగా, ఐఐఎంసీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టైటిల్‌పోరులో భవన్స్‌ 2–1తో ఎంజేసీఈటీపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఐఐఎంసీ 2–1తో ఆతిథ్య సీబీఐటీని ఓడించింది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో భవన్స్‌ సైనిక్‌పురి 3–0తో ఐఐఎంసీపై, ఎంజేసీఈటీ 3–0తో సీబీఐటీపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీబీఐటీ కాలేజి వ్యాయామ విద్య డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్యామ్‌ మోహన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్‌ కె. దీప్లా, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement