బెంగళూరు ఎఫ్‌సీ శుభారంభం | Bengaluru FC vs Mumbai City FC, Indian Super League 2017-18 | Sakshi
Sakshi News home page

బెంగళూరు ఎఫ్‌సీ శుభారంభం

Nov 20 2017 4:23 AM | Updated on Nov 20 2017 4:23 AM

Bengaluru FC vs Mumbai City FC, Indian Super League 2017-18  - Sakshi

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ నాలుగో సీజన్‌లో  తొలిసారి బరిలోకి దిగిన బెంగళూరు ఎఫ్‌సీ జట్టు విజయంతో బోణీ చేసింది.  బెంగళూరులో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–0తో ముంబై ఎఫ్‌సీపై విజయం సాధించింది. బెంగళూరు తరఫున భారత కెప్టెన్‌ సునీల్‌ చెత్రి (90వ ని.లో), ఎడువార్డో మార్టిన్‌ (67వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. మరోవైపు చెన్నైలో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 3–2తో చెన్నైయిన్‌ ఎఫ్‌సీ జట్టును ఓడించింది.

Advertisement
 
Advertisement
Advertisement