బెంగళూరు: ప్రస్తుతం "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు" ఫ్యాన్స్ పుల్‌ఖుషీతో ఉన్నారు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలవడంతో సంతోషంతో ఉబ్బితబ్బవుతున్నారు. ఓవైపు ఆర్సీబీ గెలుపుతో ఫ్యాన్స్ జోష్ మీదుంటే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి.
డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడాతూ "నిజానికి ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మాకు అన్యాయం చేశారు. కేవలం రాజకీయం కారణంగానే ఈ మ్యాచ్‌ను అక్కడికి (అహ్మదాబాద్) తరలించారు. దీనిపై నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను" అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఫైనల్ బెంగళూరులో ఫైనల్ జరిగి ఉంటే నగరానికి అది ఒక చారిత్రాత్మక సందర్భం అయ్యేదని, కానీ స్థానిక అభిమానులు ఆ అద్భుత క్షణాన్ని కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ, ఈ సీజన్ అంతటా జట్టుకు అండగా నిలిచిన కర్ణాటక అభిమానులకు, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణస్వికారం చేసే అవకాశం ఉంది.
కాగా ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ జరిగింది. GT 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించారు. కాగా ఆర్సీబీ గతేడాది సైతం ఐపీఎస్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.


