
చెన్నై: సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఎడో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 21–32తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్‌లు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు ఆటగాడు పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీల మ్యాచ్ చివరకు 30–30తో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ ఆటగాడు ప్రవీన్ కుమార్ 11 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు.