బెల్ సెంచరీ: ఇంగ్లండ్ 399 | Bell Century: England 399 | Sakshi
Sakshi News home page

బెల్ సెంచరీ: ఇంగ్లండ్ 399

Apr 15 2015 2:29 AM | Updated on Sep 3 2017 12:18 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 110.4 ఓవర్లలో 399 పరుగులకు ఆలౌటయింది.

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 110.4 ఓవర్లలో 399 పరుగులకు ఆలౌటయింది. ఇయాన్ బెల్ (143) సెంచరీ చేశాడు. రూట్ (83), స్టోక్స్ (79) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో రోచ్ 4, టేలర్ మూడు వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు మంగళవారం కడపటి వార్తలు అందే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ 32, శ్యామ్యూల్స్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement